DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ను కలిసిన నూతన రూరల్ ఎస్డీపీఓ అశ్విన్ మణిదీప్
Uncategorized

జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ను కలిసిన నూతన రూరల్ ఎస్డీపీఓ అశ్విన్ మణిదీప్

08 Oct 2026, 03:28 PM   |   Dignity News

అనంతపురం: అనంతపురం రూరల్ నూతన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ అశ్విన్ మణిదీప్ ఐపీఎస్ గురువారం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల సమస్యలపై త్వరితగతిన స్పందించడం వంటి అంశాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. గతంలో ఇదే జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన అనుభవం, స్థానిక పరిస్థితులపై ఉన్న అవగాహనతో రూరల్ సబ్ డివిజన్‌లో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తానని ఏఎస్పీ అశ్విన్ మణిదీప్ స్పష్టం చేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.