DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
విదేశీయుల వసతి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి: ఎస్పీ
Uncategorized

విదేశీయుల వసతి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి: ఎస్పీ

08 Oct 2026, 03:28 PM   |   Dignity News

అనంతపురం: వివిధ పనుల నిమిత్తం అనంతపురం జిల్లాకు వచ్చే విదేశీ పౌరుల వసతి వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, విద్యాసంస్థలు మరియు ఆసుపత్రుల నిర్వాహకులకు గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం విదేశీయులకు వసతి కల్పించే ముందు వారి పాస్‌పోర్ట్, వీసా వివరాలను పరిశీలించి, ఫారమ్-సి (FORM C) లేదా ఫారమ్-III ద్వారా నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్‌లో చెక్-ఇన్, చెక్-అవుట్ వివరాలను నమోదు చేయడం చట్టపరమైన బాధ్యత అని గుర్తుచేశారు. వివరాలు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం అందించినా ఫారిజనర్స్ యాక్ట్ 1946 ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భద్రతా దృష్ట్యా పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.