DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
గుంతకల్లు సబ్ డివిజన్‌లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్
Uncategorized

గుంతకల్లు సబ్ డివిజన్‌లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్

08 Oct 2026, 03:28 PM   |   Dignity News

అనంతపురం: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంతకల్లు సబ్ డివిజన్‌ పరిధిలో పోలీసులు గురువారం విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల కట్టడి లక్ష్యంగా ఈ ముందస్తు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాల్లో సుమారు 350 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు, రికార్డులు లేని 41 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత నేరస్తులు, ఎన్డీపీఎస్ కేసుల నిందితులు మరియు అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే చర్యలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని డీఎస్పీ హెచ్చరించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.