పామిడి, అక్టోబర్ 8 (డిగ్నిటి న్యూస్): ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పామిడిలోని లక్ష్మీ హాస్పిటల్లో ఉచిత కంటి మరియు రక్తపోటు (బీపీ) పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ లయన్ డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు, జిల్లా చైర్మన్ లయన్ పి.ఎస్. జయరామరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పట్రా శ్రీనివాసులు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ అంజి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దృష్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల ద్వారా కంటి సమస్యలను అరికట్టవచ్చని సూచించారు. అనంతరం డాక్టర్ అంజి నాయక్ పర్యవేక్షణలో పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, బీపీ పరీక్షలు చేసి సలహాలు అందించారు. ఈ శిబిరాన్ని లక్ష్మీ హాస్పిటల్ యాజమాన్యం, లయన్స్ క్లబ్ సభ్యులు విజయవంతం చేశారు.
Uncategorized
లక్ష్మీ హాస్పిటల్లో ఉచిత కంటి, బీపీ పరీక్షల శిబిరం
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
