DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
శ్రీశైలంలో అక్టోబర్ 11 నుండి దసరా మహోత్సవాలు
Uncategorized

శ్రీశైలంలో అక్టోబర్ 11 నుండి దసరా మహోత్సవాలు

08 Oct 2026, 01:54 PM   |   Dignity News

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలను సమయపాలనతో పూర్త్యయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లోకక్షేమం కోసం ఈ ఏడు సహస్ర చండీపారాయణ సహిత శతచండీ మహారుద్రయాగాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ నవదుర్గ అలంకరణలు, వివిధ వాహనసేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 19న మహర్నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అక్టోబర్ 20న విజయదశమి రోజున యాగపూర్ణాహుతి, శమీపూజ అనంతరం కృష్ణా నదిలో సాయంకాలం జరిగే అద్భుతమైన తెప్పోత్సవంతో దసరా వేడుకలు ముగుస్తాయి. భక్తుల రద్దీ దృష్ట్యా పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక లైటింగ్, పుష్పాలంకరణ, నిత్య అన్నదానం, తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు మరియు శ్రీశైలం టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.