తెనాలి/మంగళగిరి: ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మైలేరి సురేఖను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ బాధ్యతలను జనసేన పార్టీకి కేటాయించి, మైలేరి సురేఖకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు వారు పార్టీ అధిష్ఠానానికి, నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Uncategorized
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మైలేరి సురేఖ నియామకం: నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
