నంద్యాల: హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలలో యూపీఐ (డిజిటల్) చెల్లింపులకు సంబంధించిన మార్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) నిబంధనలపై వ్యాపారులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే యూపీఐపై ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పన్ను విధించలేదని, ఎండీఆర్ అనేది ప్రభుత్వ పన్ను కాదు చెల్లింపుల వ్యవస్థలోని బ్యాంకులు, యాప్‌లకు సంబంధించిన రుసుమని స్పష్టత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. చిన్న వ్యాపారులకు నెలకు రూ.లక్ష వరకు యూపీఐ వసూళ్లపై శూన్య (జీరో) ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.2,000 వరకు చేసే లావాదేవీలకు ఎండీఆర్ ఉండదు, ఆ పైన నిర్దిష్ట లావాదేవీలపై 0.4 శాతం చొప్పున రుసుము వర్తిస్తుంది. ఈ ఎండీఆర్ భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపుల విధానంపై వ్యాపారులు అపోహలకు గురికాకుండా అధికారిక మార్గదర్శకాలను గమనించాలని సూచించారు.
Uncategorized
యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
