కర్నూలు: ఏపీ మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ మరియు నోటిఫికేషన్‌లో భాగంగా కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని జాయింట్ కమిషనర్ టి. నాగలక్ష్మి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆమె, అనంతరం ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి మద్యం షాపుల టెండర్ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం సర్కిల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, టెండర్ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించి వ్యాపారుల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 17 మద్యం షాపులకు గాను 12 దరఖాస్తులు అందాయని, దరఖాస్తుల స్వీకరణకు అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఉన్నందున మరిన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు, జిల్లా అధికారి ఎం. సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Uncategorized
మద్యం షాపుల టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ టి. నాగలక్ష్మి
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
