DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
పున్న కైలాస్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వాలి: బీసీ, పద్మశాలి సమాజం
Uncategorized

పున్న కైలాస్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వాలి: బీసీ, పద్మశాలి సమాజం

08 Oct 2026, 12:35 PM   |   Dignity News

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థి, తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన బీసీ నాయకుడు, పద్మశాలి సమాజ ప్రతినిధి పున్న కైలాస్ నేతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బీసీ, పద్మశాలి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కైలాస్ నేత విశేష కృషి చేశారని, అలాగే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో గాంధీ భవన్ కేంద్రంగా అండగా నిలిచారని గుర్తుచేశారు. దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్ వంటి బీసీ నాయకులతో పాటు కైలాస్ నేతకు గతంలో కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదనే భావన బీసీ వర్గాల్లో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం పున్న కైలాస్ నేతకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా ఆయన సేవలకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా, బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందనే మంచి సంకేతం వెళ్తుందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం స్పందించి కైలాస్ నేతను ఎమ్మెల్సీగా పరిశీలించాలని వారు కోరారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.