DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
వీఆర్ఏల నిరవధిక ధర్నా 23వ రోజుకు చేరిక
Uncategorized

వీఆర్ఏల నిరవధిక ధర్నా 23వ రోజుకు చేరిక

08 Oct 2026, 12:35 PM   |   Dignity News

బనగానపల్లె: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా బనగానపల్లె ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక ధర్నా గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. 23 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై వీఆర్ఏ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పే స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలందరికీ ఒకేసారి ఉద్యోగ నియామకాలు కల్పించాలని, అర్హులకు 70 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని మరియు విధి నిర్వహణలో మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాలకు వయోపరిమితి లేకుండా కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతినిధులతో చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు గౌస్ పీరా, టి. సుబ్రహ్మణ్యం, కె. హరిబాబు, టి. బాలకృష్ణ, టి. ప్రసాద్, శేషు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.