DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
రజకుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
Uncategorized

రజకుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం

08 Oct 2026, 12:35 PM   |   Dignity News

నంద్యాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా రజక విభాగం అధ్యక్షుడిగా ఆల్వకొండ మద్దిలేటి ఎంపికయ్యారు. దశాబ్దాలుగా రజకుల అభ్యున్నతి, హక్కులు, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రజకుల్లో ఐక్యత పెంపొందిస్తూ, వారి సంక్షేమం మరియు పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అలాగే మిడ్తూరు మండలం చెరుకుచర్లలో రజక మహిళపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాలలో మడివాల మాచిదేవ రజక విద్యాసేవ సంస్థ ఆధ్వర్యంలో రాము, పలువురు నాయకులు మద్దిలేటిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.