DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షునికి సన్మానం
Uncategorized

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షునికి సన్మానం

08 Oct 2026, 12:35 PM   |   Dignity News

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జి. మద్దయ్య యాదవ్‌ను గురువారం ఘనంగా సన్మానించారు. అఖిలభారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడు ఘన మద్దిలేటి యాదవ్, ప్రధాన కార్యదర్శి శంకర్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మద్దయ్య యాదవ్‌కు శాలువా కప్పి పూలమాలలతో గౌరవించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాదవులు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారని, విద్యతోనే సమాజంలో ఉన్నత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యాదవ సంఘం సభ్యులంతా ఐకమత్యంతో మెలుగుతూ తమకు రావాల్సిన సంక్షేమ రాయితీలు, రాజ్యాంగ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి శివయ్యలతో పాటు పలువురు యాదవ సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.