నందికొట్కూరు: నందికొట్కూర్ మండలంలోని దామగట్ల గ్రామంలో పల్లె పండగ3.0 కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న శాసనసభ్యులు గిత్త జయ సూర్య రోడ్డు పక్కన పచ్చి మిరప పంట పొలంలో పచ్చిమిరప కాయలు కోస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పొలం యజమానులతో పంట సాగు పెట్టుబడులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది రైతులు సాగు చేసుకుంటున్నా పంటలకు ఎలినో ప్రభావంతో ఎండల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. అయితే రైతులు సాగు చేసిన పంటలకు సూక్ష్మ,బిందు సేద్యములను ఉపయోగించి నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పొలం బాట పట్టడం వల్ల రైతు వ్యవసాయ కూలీల కష్టాలను స్వయంగా పొలాల్లోకి వెళ్లి తెలుసుకోవడం ద్వారా సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సులభంగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులతో మాట్లాడుతూ పంట సాగు,దిగుబడి,మార్కెట్ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పి4 అధికారి తో పాటు, దామగట్ల మాజీ ఎంపీటీసీ తిప్పారెడ్డి,బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
Uncategorized
దామ గట్లలో పొలం బాట పట్టిన నందికొట్కూరు ఎమ్మెల్యే…. గిత్త.
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
