DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు శ్రీ నవనంది హై స్కూల్ విద్యార్థుల ఎంపిక.
Uncategorized

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు శ్రీ నవనంది హై స్కూల్ విద్యార్థుల ఎంపిక.

08 Oct 2026, 08:56 AM   |   Dignity News

నందికొట్కూర్: రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ జూడో పోటీలకు నందికొట్కూరు పట్టణానికి చెందిన శ్రీ నవనంది హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బద్దుల శ్రీధర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బద్దుల శ్రీధర్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ప్రధమ స్థానంలో ఎంపికైన విద్యార్థులు ఏ. హిమ తేజ, కే. వినయ్ కుమార్ లను అభినందించారు. జిల్లాస్థాయిలో జరిగిన జూడో అండర్19, – 50 కేజీల విభాగంలో ఏ.హిమతేజ, కే వినయ్ కుమార్ అండర్14, – 45 కేజీల విభాగంలో ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ఈనెల10, 11, 12 తేదీలలో తిరుపతిలో జరుగు రాష్ట్రస్థాయి ఎస్ జిఎఫ్ జూడో పోటీల కు ఎంపికయ్యారన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.