DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
దళిత మహిళపై దాడి కేసు: నిందితుడి అరెస్ట్
Uncategorized

దళిత మహిళపై దాడి కేసు: నిందితుడి అరెస్ట్

07 Oct 2026, 04:40 PM   |   Dignity News

నల్గొండ, అక్టోబర్ 7 (డిగ్నిటి న్యూస్): నల్గొండ జిల్లా పీకే మల్లేపల్లిలో గ్రామసభ సందర్భంగా మాజీ వీఓఏ, దళిత మహిళ మాధవిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు అమర్‌నాథ్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొదుపు సంఘాల డబ్బుల వివాదంలో గ్రామసభలో మహిళపై దుర్భాషలాడుతూ, చెంప పగలగొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.