హైదరాబాద్ / నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన మూగ, చెవిటి దంపతులు జంపాల మహేష్ కుమార్, రజితలకు పుట్టిన చిన్నారికి కూడా మూగ, చెవిటి తనం రావడంతో, మెరుగైన వైద్యం అందిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం మంత్రిని ఆశ్రయించగా, తక్షణమే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి చిన్నారిని ఎత్తుకుని అక్కున చేర్చుకుని రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిన్నారి పూర్తి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులకు అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని ఆ దంపతులకు భరోసానిచ్చారు.
Uncategorized
2 లక్షల వైద్య సాయం
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
