DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఏవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు: అంధుల పాఠశాలలో అన్నదానం, గోసేవ
Uncategorized

ఏవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు: అంధుల పాఠశాలలో అన్నదానం, గోసేవ

07 Oct 2026, 04:40 PM   |   Dignity News

నంద్యాల: ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (సీడ్స్ కార్పొరేషన్) మాజీ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏవీ యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంతారెడ్డి ఆధ్వర్యంలో హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ప్రతినిధి ఎస్. చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పోలూరు రోడ్డులోని జీవన్ జ్యోతి అంధుల పాఠశాల విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మూడు పూటలా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఎస్‌బీఐ కాలనీలోని గోశాలలో గోవులకు దాన మరియు మేత పంపిణీ చేశారు. ఏవి సుబ్బారెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.