DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
టిడ్కో గృహాల సమస్యల పరిష్కారానికి చర్యలు: చైర్మన్ అజయ్ కుమార్
Uncategorized

టిడ్కో గృహాల సమస్యల పరిష్కారానికి చర్యలు: చైర్మన్ అజయ్ కుమార్

07 Oct 2026, 02:50 PM   |   Dignity News

నంద్యాల: నంద్యాలలోని ఎస్‌ఆర్‌బీసీ, అయ్యలూరు మెట్ట ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాలను టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి స్టేట్ బోర్డ్ డైరెక్టర్ తోల్లా మంజునాథ్, జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్‌లతో కలసి గృహాల నిర్మాణ పరిస్థితి, తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేసి, అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.