DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ
News

మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ

01 Oct 2026, 03:36 AM   |   Dignity News
  • ఆళ్లగడ్డలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి విలేకరుల సమావేశం!

ఆళ్లగడ్డ, అక్టోబర్ 30 (డిగ్నిటి న్యూస్): 2026-27 సంవత్సరానికి గాను ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నూతన మద్యం పాలసీలో రెన్యూవల్ కాని 4 మద్యం షాపుల కేటాయింపునకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1, 2026 నాడే చివరి తేదీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ (నోడల్ ఆఫీసర్) టి. నాగలక్ష్మి వెల్లడించారు. బుధవారం కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు, నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్. విజయ్ కుమార్ గార్లతో కలిసి ఆమె ఆళ్లగడ్డ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డ రూరల్ పరిధిలో 1 షాపు, శిరివెళ్ల మండలంలో 2 షాపులు, రుద్రవరం మండలంలో 1 షాపునకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓపెన్ కేటగిరీ మద్యం షాపులకు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తుదారులు ప్రవేశ రుసుము కింద 1,000 రూపాయలు, అప్లికేషన్ ఫీజు కింద 3,00,000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆళ్లగడ్డ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, లైసెన్సీదారులు, ఆసక్తిగల దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

📰
Udaya Kiran kumarReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.