DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
లోకకల్యాణార్థం శతచండి యాగం
News

లోకకల్యాణార్థం శతచండి యాగం

30 Sep 2026, 07:15 AM   |   Dignity News
  • పేరుసోముల విష్ణుకాంటి క్షేత్రంలో ఘనంగా పూర్ణాహుతి

సంజామల, సెప్టెంబర్ 30 (డిగ్నిటి న్యూస్): లోకకల్యాణార్థం, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామంలోని శ్రీ విష్ణుకంటి క్షేత్రంలో శతచండి యాగం వైభవంగా పూర్తయింది. నూతనంగా నిర్మించిన శ్రీ మోక్ష లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర అధ్యక్షులు అవధూత రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో శృంగేరి సంస్థానం ముఖ్య అర్చకులచే గత మూడు రోజులుగా (ఈ నెల 28 నుండి) నిర్వహించిన ఈ శతచండి హోమం బుధవారం మహా పూర్ణాహుతితో ముగిసింది.ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాడిపంటలు సమృద్ధిగా పండి పశుగ్రాస కొరత తీరాలనే సంకల్పంతో ఈ యాగం తలపెట్టినట్లు తెలిపారు. పూర్ణాహుతి సందర్భంగా విచ్చేసిన భక్తులు, మహిళలకు చీరలు, పసుపు-కుంకుమలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్షేత్రంలో నిరుపేదలకు, వృద్ధులకు నిత్య అన్నదానంతో పాటు గోశాల నిర్వహణ, నిత్య పూజలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

📰
Chinna MadduletyReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.