సెప్టెంబర్ 17:మిట్నాల మారెమ్మ ఆలయ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలుఆదేశాలతో గ్రామంలో హర్షాతిరేకాలు.. పెద్ద పండుగలా సంబరాలుమిట్నాల, గ్రామంలోని శ్రీ మారెమ్మ దేవత ఆలయానికి సంబంధించిన భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు వెలువడటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ భూములకు రక్షణ లభించనుందనే ఆశాభావంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు.ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్లు 91/1, 91/3 భూముల వ్యవహారంపై దాఖలైన రిట్ పిటిషన్ నంబర్లు 14346/2026, 14351/2026కు సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత పత్రాల్లో పేర్కొన్నట్లు సమాచారం.అదేవిధంగా సూచనా పత్రం నం. M1/CEO-19025(39)/3/2026, తేదీ 09-06-2026 ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు అందినట్లు పేర్కొన్నారు. 17-09-2026లోగా భూమిని స్వాధీనం చేసుకుని, సంబంధిత దేవదాయశాఖకు అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నట్లు పత్రంలో వెల్లడైంది.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు ప్రారంభమవుతాయనే నమ్మకంతో మిట్నాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకరినొకరు అభినందించుకుంటూ, ఈ పరిణామాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు.“మారెమ్మ అమ్మవారి భూములకు రక్షణ లభించాలి.. ఆలయ ఆస్తులు పరిరక్షించబడాలి” అంటూ గ్రామస్తులు ఆకాంక్ష వ్యక్తం చేస్తు నెరవేర్చుకున్నారు
Uncategorized
మిట్నాల మారెమ్మ ఆలయ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
