DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
News

ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శిగా రామారావు యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక!

22 Sep 2026, 09:00 AM   |   Dignity News
  • డిగ్నిటి న్యూస్ ప్రతినిధులకు జిల్లా కార్యవర్గంలో కీలక బాధ్యతలు

నంద్యాల, సెప్టెంబర్ 20 (డిగ్నిటి న్యూస్): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు ఆదివారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.అనంతరం నిర్వహించిన ప్రతినిధుల సభలో నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ దినపత్రిక ‘డిగ్నిటి న్యూస్’ ఎడిటర్ చిర్రబోయిన రామారావు యాదవ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ‘డిగ్నిటి న్యూస్’కు చెందిన రామమోహన్ ప్రచార కార్యదర్శిగా, జానకి రామ్ యాదవ్, నారాయణలు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పత్రికా రంగంలోనూ, విలేకరుల హక్కుల పోరాటంలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్న ‘డిగ్నిటి న్యూస్’ ప్రతినిధులకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల జిల్లా జర్నలిస్టు లోకం హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల సంక్షేమం, సంఘ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా రామారావు యాదవ్, నూతన భాద్యతలు స్వీకరించిన ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ మహాసభలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, రాయలసీమ ఇన్ఛార్జ్ జయరాజ్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, త్రీటౌన్ సీఐ వేణుగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.