DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
Uncategorized

రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నల్లగొండ నారాయణ స్కూల్ విద్యార్థుల ఘనవిజయం

24 Sep 2026, 09:46 AM   |   Dignity News

నల్లగొండ, ఆగస్టు 26 (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలోని ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో నల్లగొండ పట్టణానికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకులతో సత్తా చాటారు. అండర్-10 విభాగంలో 4వ తరగతికి చెందిన అలేఖ్య, కైవల్య కేతన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలు (మొదటి ర్యాంకులు) సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరైన ఈ పోటీలలో నల్లగొండ క్రీడాకారులు చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించిన విద్యార్థులను నారాయణ స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్లను అందజేసింది.ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఐఆర్‌ఎస్‌ఎఫ్ (IRSF) ఇండియా టెక్నికల్ డైరెక్టర్ అంజుమ్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణకు, నల్లగొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్, తెలంగాణ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మమ్మిడి శ్రీధర్ పటేల్, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ఈశ్వర్, సంగారెడ్డి జిల్లా సెక్రటరీ కె. ప్రేమ్‌కుమార్, దాడి శ్రీనివాస్, నాయిని శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొని విజేతలను కొనియాడారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.