ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి మాణిక్య రావు అరుదైన నివాళి
నంద్యాల, ఆగస్టు 26 (డిగ్నిటి న్యూస్): మదర్ థెరెసా జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి డి. మాణిక్య రావు గుడ్డు పెంకుపై ఆమె చిత్రాన్ని గీసి తన వినూత్న అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఈ సూక్ష్మ కళాఖండాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మదర్ థెరెసా సమాజానికి చేసిన సేవలు, పేదల పట్ల ఆమె చూపిన ప్రేమ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, ఆ అభిమానంతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మాణిక్య రావు తెలిపారు. నాజూకైన గుడ్డు పెంకుపై మదర్ థెరెసా రూపాన్ని అత్యంత ప్రతిభతో ఆవిష్కరించిన ఆయన దాతృత్వ కళాకృతిని పలువురు విశేషంగా అభినందించారు.

