DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
యశోద హాస్పిటల్స్‌కు ప్లాటినం అవార్డు
Uncategorized

యశోద హాస్పిటల్స్‌కు ప్లాటినం అవార్డు

25 Aug 2026, 10:56 AM   |   Dignity News

ELSO ప్రతిష్టాత్మక గుర్తింపు.. నంద్యాల ప్రెస్ మీట్‌లో వివరించిన ప్రతినిధులు

నంద్యాల, ఆగస్టు 25 (డిగ్నిటి న్యూస్): ప్రపంచ స్థాయి ట్రాన్స్‌ప్లాంట్ కేర్, అత్యుత్తమ ఎయిర్ అంబులెన్స్ సేవలు అందిస్తున్న హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) ఎక్స్‌ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ELSO) నుంచి అత్యున్నత స్థాయి ‘ప్లాటినం అవార్డు’ సాధించిందని డాక్టర్ నిశాంత్ వెల్లడించారు. ఈ గుర్తింపు ద్వారా భారతదేశంలోనే ఏకైక ప్లాటినం-సర్టిఫైడ్ ECMO సెంటర్‌గా యశోద హాస్పిటల్స్ నిలిచిందని తెలిపారు. మంగళవారం నంద్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హాస్పిటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ నిశాంత్ సంబంధిత వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగుల భద్రత, క్లినికల్ ఎక్సలెన్స్ మరియు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు యశోద హాస్పిటల్స్ కట్టుబడి పనిచేస్తోందనడానికి ఈ అవార్డే నిదర్శనమని పేర్కొన్నారు. ఆధునిక వైద్యంలో అత్యంత సంక్లిష్టమైన ECMO, అడ్వాన్స్‌డ్ ICU కేర్, కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలను అత్యంత అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో అందిస్తున్నట్లు చెప్పారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగులను దేశ విదేశాల నుంచి వేగంగా తరలించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ప్రతినిధులు సుమంత్ రెడ్డి, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.