DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం
News

మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం

04 Aug 2026, 12:29 PM   |   Dignity News

నల్లగొండ, ఆగస్టు 4 (డిగ్నిటీ న్యూస్): మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా కలిసికట్టుగా కృషి చేయాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్–మిషన్ స్పందన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడితే కుటుంబాలు, యువత కెరీర్ నాశనమవుతాయని, జిల్లాలో ఇప్పటికే 97 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని, ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదనపు ఎస్పీ రమేష్, బ్రహ్మకుమారీస్ ప్రతినిధి ధనలక్ష్మి మాట్లాడుతూ మొబైల్ వ్యసనం కూడా ప్రమాదకరమేనని, ఆగస్టు 6 నుంచి 20 వరకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, అధికారులు కృష్ణవేణి, రాహుల్, మదన్ మోహన్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

📰
Gangula EdukondalReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.