DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
తల్లిపాలపై చైతన్యం
News

తల్లిపాలపై చైతన్యం

04 Aug 2026, 11:41 AM   |   Dignity News

నల్గొండ, ఆగస్టు 4 (డిగ్నిటి న్యూస్): నల్గొండ పట్టణంలోని 48వ డివిజన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో స్థానిక కార్పొరేటర్ యామ కవిత దయాకర్ పాల్గొని ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి తల్లిపాల విశిష్టతను తెలియజేయడమే కాకుండా, తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.

ఆరోగ్యవంతమైన తల్లి, శిశువు ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ చైతన్య కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు జయమ్మ, శ్రీదేవి, అంగన్‌వాడీ టీచర్ మంగమ్మ, ఆయా సుమలత, ఆశావర్కర్ ధనలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక తల్లులు, పిల్లల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

📰
Gangula EdukondalReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.