DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
రోడ్డు నిర్మాణానికి మంత్రి హామీ
News

రోడ్డు నిర్మాణానికి మంత్రి హామీ

02 Aug 2026, 05:47 AM   |   Dignity News

నల్గొండ, ఆగస్టు 2 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని వెలుగుపల్లి నుంచి అద్దంకి బైపాస్ అనిశెట్టి దుప్పలపల్లి వరకు డాంబర్ రోడ్డు నిర్మించాలని రసూల్ పురం సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలుక సైదిరెడ్డి, జేరిపోతుల శ్రీరామ్, గుండెబోయిన శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు, గుండెబోయిన సైదులు, గోలి సైదులు, బుసి తదితరులు పాల్గొన్నారు.

📰
Gundeboina Srinivas YadavReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.