DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
పాణ్యం వద్ద తప్పిన బస్సు ప్రమాదం: ప్రయాణికులు క్షేమం
News

పాణ్యం వద్ద తప్పిన బస్సు ప్రమాదం: ప్రయాణికులు క్షేమం

12 Jul 2026, 03:18 AM   |   Dignity News

పాణ్యం, జూలై 12 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎన్‌హెచ్ 40 జాతీయ రహదారిపై విజయానికేతన్ స్కూల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం తప్పింది. 27 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సిబ్బందితో హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న బస్సు కుడివైపు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డివైడర్ ఎక్కి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం కొంత భాగం దెబ్బతినగా, ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పాణ్యం హైవే పెట్రోల్ సిబ్బంది క్షణాల్లో స్పందించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.