DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటమే జనసేన లక్ష్యం: రాచమడుగు సుందర్ స్పష్టీకరణ
News

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటమే జనసేన లక్ష్యం: రాచమడుగు సుందర్ స్పష్టీకరణ

29 Jun 2026, 06:22 PM   |   Dignity News

నంద్యాల, జూన్ 29 (డిగ్నిటి న్యూస్): సమాజంలో మార్పు కోసం, పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాపక్షం వహించి పోరాడటమే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమని నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్ స్పష్టం చేశారు.

నంద్యాల నియోజకవర్గ స్థాయి జనసేన సోమవారం నంద్యాల బొమ్మల సత్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో ‘జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల సేకరణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టనష్టాలలో భాగస్వామ్యులయ్యే నాయకులకు పార్టీలో ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాయకుల మధ్య సమన్వయం పెరగాలని, ప్రజా సమస్యలపై నిరంతరం గళం విప్పుతూ జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సుందర్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.