DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
చిన్నసురారంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
News

చిన్నసురారంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19 Jun 2026, 12:28 PM   |   Dignity News

– కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

డిగ్నిటి న్యూస్, నల్గొండ నియోజకవర్గం- జూన్ 19): నల్గొండ మండలం చిన్నసురారం గ్రామంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలాధ్యక్షుడు కె.వి.ఆర్. సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీ దేశానికి స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. ఈ వేడుకల్లో సర్పంచ్ నారగోని రేణుక భద్రయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు సంకు ధనలక్ష్మి, గాలి నాగరాజు, మార్త రాంబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

📰
Gundeboina Venkanna YadavReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.