DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
చార్మినార్ జోనల్ కమిషనర్‌కు సత్కారం
News

చార్మినార్ జోనల్ కమిషనర్‌కు సత్కారం

29 May 2026, 11:51 AM   |   Dignity News

హైదరాబాద్, మే 29 (డిగ్నిటి న్యూస్): జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కన్నం సత్యనారాయణను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. నిరుపేద సాంప్రదాయ మత్స్యకార కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ ఈ స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఆయన సామాజిక కార్యక్రమాలతో పాటు, వయోవృద్ధుల సంక్షేమానికి, ప్రతిభావంతులైన నిరుపేద గంగపుత్ర విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.