DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బస్సు ఎక్కుతూ హఠాత్తుగా కుప్పకూలి వ్యక్తి మృతి..!
Crime

బస్సు ఎక్కుతూ హఠాత్తుగా కుప్పకూలి వ్యక్తి మృతి..!

28 May 2026, 02:58 PM   |   Dignity News

కొలిమిగుండ్ల, మే 28 (డిగ్నిటి న్యూస్): కొలిమిగుండ్ల బస్టాండ్ ఆవరణలో బనగానపల్లి బస్సు ఎక్కుతుండగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన దారం దేవ భూషణ్ అనే వ్యక్తి గురువారం హఠాత్తుగా కిందపడిపోయారు. స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. బస్సు ఎక్కబోతూ క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో బస్టాండ్ ఆవరణలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.