RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి

డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 10 (డిగ్నిటీ న్యూస్): దళితుల ఆత్మీయ బంధువు సీఎం రేవంత్ రెడ్డి అని డిసిసి అధ్యక్షులు పున్న కైలాస నేత వెల్లడించారు.ఆదివారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణకై సమీక్ష సమావేశం నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా ఎస్ .సి.సెల్ సంస్థాగత నిర్మాణ ఇంచార్జీ మందుల సూర్యకిరణ్ హాజరైనారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 5 పదవులు దళితులకు దక్కాయని, ఎస్. సి. వర్గీకరణతో అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దక్కిందని అన్నారు.

దళితుల ఆత్మీయ బంధువుగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని కొనియాడారు.దళితులను వంచించిన కేసీఆర్ ను బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మబోరని 2029లో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మందుల సూర్య కుమార్ మాట్లాడుతూ సంస్థాగతంగా దళిత విభాగం బలంగా ఉందని కాంగ్రెస్ కు అండగా నిలిచేది దళితులేనని అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యమని అన్నారు.త్వరలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా మండల గ్రామ స్థాయిలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్. సి. సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, బీసీ సేల్ చైర్మన్ జిల్లా పల్లి పరమేష్,కుర్పటి గణేష్,పేరిక అంజయ్య, పుల్లెంల సందీప్, చింతపల్లి బాలకృష్ణ,సంజయ్,వినోద్, చిరుమర్తి ఉపేందర్, పెరిక హరిప్రసాద్, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు .

Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version