RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం

  • సీఎం సభ వేళ పోలీసుల తీరుపై బీజేపీ నేత పాలకూరి రవిగౌడ్ తీవ్ర ఆగ్రహం

నల్లగొండ, జూన్ 28 (డిగ్నిటి న్యూస్): ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు, కార్మిక సంఘాల నేతలు, ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలకూరి రవిగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు శాంతియుత నిరసనలను, ప్రజాస్వామిక హక్కులను కాలరాసేలా వ్యవహరించడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, తెల్లవారుజామునే నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి నిర్బంధ చర్యలతో ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కలేరని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి అణచివేత ధోరణిని వీడాలని ఆయన డిమాండ్ చేశారు.

Gangula Edukondal
Agriculture Reporter
Nalgonda Dist.
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version